🌴🌹🌾🌿🌷హాపీ వృక్షావళి!! పుడమితల్లి కోసం చిన్న హాండ్‌మేడ్ వీడియో🌷 🌿 🌾 🌹 🌴


🌹This is not preaching but just ideas and dreams to share with those who have the might and the means to make them happen🌹 

భూమాత దశాబ్దాల మన ‘బాల్యా’న్ని మనకిష్టమైనట్టు గడపనిచ్చింది. తనకిష్టమైనవి, తనకి కావాల్సినవి త్యాగం చేసింది. ఇప్పుడింక నేలతల్లికి అవసరమైనవి మనమివ్వాలి. మన ప్రాధాన్యతలు, ప్రయారిటీలు మార్చుకోవాలని నేలతల్లి పర్యావరణం ద్వారా సంకేతాలిస్తోంది. పిల్లలకి ఒక వయసు వచ్చేవరకూ బొమ్మలు ఆటలు తప్పనిసరి. బాల్యం దాటాక పుస్తకం చదవాలి, మస్తకం పనిచెయ్యాలి. పుడమితల్లి తన పిల్లలకి అదే చెప్తోంది. టపాకాయగా మారి పేలిపోయిన ప్రతి రూపాయికీ ఒక చెట్టు నాటమని మౌనంగా సైగ చేస్తోంది.

సింపుల్‌గా, అందంగా, ఏదో లోతైన సత్యాన్ని మనసుకి స్ఫురింపజేస్తూ వెలిగే దీపంతో మనం గడిపేది కొన్ని నిముషాలు. ఆనందంతోపాటూ హడావిడి, ఆర్భాటం; వీటికి తోడు ఆడంబరం వెంటేసుకుని వచ్చే స్వీట్లు, టపాకాయలకోసం వెచ్చించే సమయం కొన్ని గంటలు. నానాటికీ కలుషితం అవుతున్న నైతిక వాతావరణం మనం దీపానికి ప్రాధాన్యత పెంచాలని చెబుతోంది. స్వచ్ఛంగా వెలిగే దీపాన్ని మనసులో సత్యంగానూ, బాహ్యంలో ఆ దీపపు పరమార్ధాన్ని ప్రతిఫలించే వృక్షాల రూపంలోనూ శాశ్వతత్వం కల్పించమని ప్రకృతి, మానవప్రకృతి కోరుకుంటున్నాయి. టపాకాయల హంగులకి, మండి మాడి ఉక్కిరిబిక్కిరి చేసే పొగగా మిగిలే వాటి వయసుపొంగులకి చెట్టూచేమల పచ్చిగాలితో, పూలూపళ్ళ సుగంధాలతో సాంత్వననివ్వాల్సిన సమయం వచ్చిందనీ, దీపావళితో వృక్షావళినీ పండగగా చేసుకోవాలనీ భావితరాల భవిష్యత్తు భారతీయులనడుగుతోంది.

 

🌹This is not preaching but just ideas and dreams to share with those who have the might and the means to make them happen🌹 

🐦🌄🌏🙏🌊🐦

 

 

4 thoughts on “🌴🌹🌾🌿🌷హాపీ వృక్షావళి!! పుడమితల్లి కోసం చిన్న హాండ్‌మేడ్ వీడియో🌷 🌿 🌾 🌹 🌴

 1. విన్నకోట నరసింహారావు

  చక్కటి సందేశం. విడియో బాగా కంపోజ్ చేశారు. జనాల్లో స్పృహ పెరుగుతుందని ఆశిద్దాం.
  మీకందరికీ దీపావళి / వృక్షావళి శుభాకాంక్షలు 🌴.

  Like

  Reply
  1. నిరంజన్ బొబ్బిలిపాటి

   నిజంగా ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఇలాగే ప్రయత్నిస్తూ పోదాం పదండి ముందుకు. ఇంటింటా వెలిగే దీపాల కాంతులు మీ జీవితాల్లో వెలుగు రేఖలు విర జిమ్మాలని మీ కళ్ళలో ఆనందం విరియలి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

   Like

   Reply
   1. YVR's అం'తరంగం' Post author

    విన్నకోటగారు, నిరంజన్ గారు
    అప్పటికప్పుడు ఏదో ఒకటి రాయాలనిపించి రాసేసాను. ఐడియా రిసీవ్ చేసుకుని ఆశీర్వదించిన మీ సహృదయానికి , వ్యాఖ్యలకు🙏🙏🙏……….🙏

    Like

    Reply
 2. నిరంజన్ బొబ్బిలిపాటి

  నిజంగా ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఇలాగే ప్రయత్నిస్తూ పోదాం పదండి ముందుకు. ఇంటింటా వెలిగే దీపాల కాంతులు మీ జీవితాల్లో వెలుగు రేఖలు విర జిమ్మాలని మీ కళ్ళలో ఆనందం విరియలి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s