వాట్సాప్ప్ ముచ్చట్లు

Whatsapp ముచ్చట్లు (3) – మానవుల Children’s Meet – దేవుళ్ళ Parent’s Meet

“దేవుణ్ణి నమ్మే తొంభైశాతం మంది జనుల కోసం…” అంటూ మా ఫ్రెండ్ ఒక పోస్టు పెట్టాడు. త్వరలోనే ఒక చిల్డ్రన్స్ మీటింగ్ కానీ, ఒక పేరెంట్స్ మీటింగ్ కానీ జరగబోతోంది, జరక్కపోయినా జరగాలని కోరుకుంటున్నాను అంటూ మొదలైంది మెసేజి. అందరూ ఆసక్తిగా ఓపెన్ చేసి చదివేశారు. స్మైలీలు 😊, లైకులు 👌, చప్పట్లు 👏, బుర్ర చుట్టూ తిరిగే చక్రంతో ఉన్న ఎమోజీలు 😇… ఇలా వివిధ ఎక్స్ప్రెషన్లు వెల్లువెత్తాయి. ఇంతకీ మెసేజి సారాంశం ఏంటంటే –

ప్రపంచంలో అందరూ, మతాలకతీతంగా, దేవుణ్ణి తండ్రిగా భావిస్తారు కనక, పిల్లలన్నాక తండ్రికి ఇష్టమైన పనులే పిల్లలు చెయ్యాలి కనక,

ఇప్పుడు ఏ దేశం, ఏ జాతి, ఏ మతాన్ని చూసినా అందరూ దేవుడికి ఇష్టమైన పన్లు తక్కువగాను, ఇష్టంలేని పన్లు అతిగానూ చేస్తున్నారు కనక,

ఆ విషయాన్ని గ్రహించి అందరూ కూడబలుక్కుని చెడ్డపన్లు – అంటే దేవుడికి ఇష్టంలేని ఏ పన్లూ కూడా అన్నమాట – చెయ్యకూడదు అని ఒట్టు పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకోడం (దోపిడీ, గూండాయిజం, ఇంపీరియలిజం, మతదురహంకారం, వగైరాలన్నీ అనమాట) మానేసి, ఎంచక్కా కలిసిమెలిసి ఉంటూ, ఒకరికి సాయం చెయ్యడంలో స్ట్రాంగా, ఎవరి సాయమైనా తీసుకునేప్పుడు సాఫ్ట్‌గా ఉంటూ లోకాలన్నిటికీ తండ్రి అయిన దేవుణ్ణి సంతోషంగా ఉంచాలిట.

అది కానీ జరగలేదో –

అల్లా, జీసస్, రాముడు, క్రిష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు …. మొదలైన దేవుళ్ళందరూ – ఎవరి అనుయాయులకి వాళ్ళు పేరెంట్స్ కదా! – పేరెంట్స్ మీటింగ్ పెట్టుకోవాల్ట. పెట్టుకుని ఒక్క పెట్టున, “ఒరేయ్ పిల్లల్లారా! మీ పిచ్చిగోల ఆపండి. మేమంతా వేరు వేరు కాదు, అంతా ఒకటే, మా గురించి కొట్టుకు చావకండి. మాకోసం కొట్టుకోకండి. మీకోసం, మీ పిల్లలకోసం కూడా కొట్టుకోకండి. అందరి కోసం కలిసుండండి. మేమంతా ఒకటే కనక మీరంతా కూడా ఒకటే,” అని డిక్లరేషన్ ఇచ్చేయ్యాల్ట.

ఈ రెండిట్లో ఎదో ఒకటి – అంటే చిల్డ్రన్’స్ మీటింగ్ కానీ , పేరెంట్స్ మీటింగ్ కానీ తొందరలో జరుగుతుందని ఆశిస్తున్నానంటూ మెసేజ్ ముగించాడు మా ఫ్రెండు.

Highly thought-provoking అనిపించింది. అనిపించిందే రాసేసి మూడు చిన్ముద్రలు – అంటే ఇవీ 👌 👌 👌 – ఇంకనుంచీ సోషల్ మీడియాలో లైకు పెట్టినప్పుడల్లా చిన్ముద్ర అర్ధాన్ని గుర్తుచేసుకుంటూ వుంటే జీవాత్మకి, పరమాత్మతో అనుసంధానం జరిగిపోతుంది. అంబికా దర్బార్ బత్తీ వెలిగించకుండానే. (చిన్న మనవి, ఈ రహస్యాన్ని కనీసం ఇద్దరికి చెప్పండి. ఆ ఇద్దరూ అడిగినవాళ్ళూ, అడగనివాళ్ళూ అని తెలుసనుకుంటా. దాంతో సోషల్ మీడియాలో లైకుల గోల తగ్గుతుంది లేదా లైకు పెట్టినప్పుడల్లా ఆధ్యాత్మికభావాలు పెరుగుతాయి. హిందూమతం పడనివాళ్ళు ఆ సింబల్ వాడడం మానెయ్యచ్చు కూడా, అది వేరే విషయం. సరే, అసలు విషయానికి మళ్ళీ వద్దాం. చిన్ముద్రా ప్రభావమో ఏమోగానీ మనసులో ఒక ఆలోచన మొదలైంది. అది ఇదీ –

అన్ని మతాల దేవుళ్ళూ పేరెంట్ మీటింగ్ పెట్టుకోడం ఎలా కుదురుతుందీ అసలు? ఎవరికి, ఎందరికి, ఏ రూపంలో కనిపించినా (ఏ రూపమూ లేక కనిపించకపోయినా) దేవుడికి తన మటుకు తను ఒకణ్ణి అనే భావమే కదా వుండేది? మీకే రూపం కనబడినా అన్నిట్లో నన్నే చూడండిరా బాబూ అనే కదా ఆయన గోల పాపం. మనం పట్టించుకోకపోతే ఆయనకా పనిష్మెంటు? ఇప్పుడా మీటింగ్ కోసం ఏకోనైకో నమోన్నమః అనుకుంటూ అన్ని రూపాలూ ధరించి మీటింగ్ పెట్టుకోవాలన్నా “ఆయనకి” అది కుదురుతుందా? అన్ని విశ్వాసాలవారూ అంతర్ముఖులై ఆత్మారాముణ్ణి** సందర్శించనిదే ఆ “మీటింగు” జరిగేపనా? (**ఆత్మారాముడు అంటే అదిగో మళ్ళీ రాముడు అంటే మేం ఒప్పుకోం అంటారేమో, అంతర్యామి / సర్వాంతర్యామి అందాం. ఆత్మారాముడంటే అతనొక రకమైన రాముడు అనుకునే వాళ్ళే మనవాళ్ళలో ఎక్కువని నాక్కాస్త అనుమానం. మనకే అర్ధంకానప్పుడు కుహనా మేధావులకీ, చాదస్తపు మతాలవాళ్ళకీ ఏం అర్ధం అవుతుంది? ఆత్మాబుద్ధ, ఆత్మాబాబా, ఆత్మాడేరా, …. ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ఒక్కొక్క ఆత్మా _ _ _ లు బయల్దేరిపోతారు. ఆత్మారాముడు =  ఆత్మయందే రమించుచుండువాఁడు / తనలో ఉన్న దేవుడు అని ఆంధ్రభారతి ఉవాచ)

“ఏకం సత్ విప్రాః బహుధా వదంతి” కి అర్ధం తెల్సుకోడం మానేసి మతాలు మార్చడం, తర్క-వివేకాల గొంతు నొక్కెయ్యడం జరుగుతుంటే చిల్డ్రన్’స్ మీటింగ్‌కి అవకాశం ఎక్కడ? అలాంటి గందరగోళంలో పేరెంట్’స్ మీట్ కి అర్ధం ఎక్కడ?

ఇదే ఆలోచనని పెద్దగా ఆలోచించకుండానే పోస్ట్ చేసేశా.

స్మైలీలు, లైకులు, చప్పట్లు, బుర్ర-తిరుగుడు-చక్రపు ఎమోజీలు…… ఏవీ రాలేదు.

మొదట మెసేజ్ పెట్టినతను మాత్రం,  “😊 😊 👍,” అన్నాడు. నేను అందరికీ ఇలా 😈 కనిపిస్తున్నానా? అనిపించింది.

అంతే సంగతులు. బై4నౌ 😈, సారీ, సారీ అది కాదు, ఇది – బై4నౌ 😊 🙏

***

16 thoughts on “Whatsapp ముచ్చట్లు (3) – మానవుల Children’s Meet – దేవుళ్ళ Parent’s Meet

 1. గతంలో ఓ పారి మా స్కూళ్ళో …..

  కం: పేరెంట్స్ మీట్ పెట్టిస్తే
  సారూ ! రాలే దెవరును , సారీ
  జెప్పే
  రా రోజు గాక మళ్ళా
  ‘భారీ ఫాలోడు లంచి పరుగెత్తేరూ !

  మెచ్చుకోండి

 2. పేరెంట్స్ మీట్ కి లంచ్ ఫాలోస్ అంటే గాని
  రాలేదెవరూ మా స్మూల్లో సారూ ! మరి మీ దేవతల పేరెంట్స్ మీ
  ట్ కి …..

  మెచ్చుకోండి

  • అందరి దేవుళ్ళకీ “లంచ్ ఫాలోస్” అండి 😊.
   సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
   భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ | శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ||
   భాషలు, రూపాలు, రుచులు మారినా “వండివార్చే పద్ధతి” మాత్రం అదే 👆మనసా మయా విరచితమే 🙏

   మెచ్చుకోండి

 3. పేరు ‘సురల-మీటు’ ఫేవరే టేదయ్య?
  ఘృతము పాయసాల కేమి గాని ,
  ఆకసమ్ము వీడి యవనికి దిగి వచ్చు
  సురలకు ‘సుర’లేద ? చోద్య మిదియు .

  మెచ్చుకోండి

  • @వెంకట రాజారావు . లక్కాకుల గారు,
   స”రస”మైన పద్యం మాస్టారు 😊
   //సురలకు ‘సుర’లేద ? చోద్య మిదియు//
   నిజంగా మందుబాబుల్ని మెచ్చుకోవాలండి. సురలు ఎక్కడో ఆకాశంలో కాదు హృదయంలోనే వున్నారని పర్ఫెక్ట్ గా అర్ధం చేసుకున్న తత్వవేత్తలు. “లోపలున్నవాడి”కి ఘృత-పాయసాల కన్నా సుర తేలిగ్గా దొరికే రోజులు కదా!

   మెచ్చుకోండి

 4. మందుబాబులకు కిక్కిచ్చే మద్యం కంటే
  సారూ ! …..

  మత్తిల జేయు ‘మాట’ మహిమాన్వితమై
  ప్రియురాలు పల్కినన్ ,
  మత్తిల జేయు ‘పాట’ మహిమాన్వితమై
  స్వరరాజు పాడినన్ ,
  మత్తిల జేయు ‘భక్తి’ మహిమాన్వితమై
  గురుమూర్తి విన్చినన్ ,
  మత్తిలజేయు మద్యమున మత్తు యొకించుకె పోల్చి చూచినన్ .

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

 5. మీరు చేసే ఇటువంటి ఆలోచనలు నాబోటి వాళ్ళకి out of depth గానీండి, // “ఆత్మారాముడంటే అతనొక రకమైన రాముడు అనుకునే వాళ్ళే …….”// అని మీరన్నది చదివితే మాత్రం ఒక పాత జోక్ గుర్తొచ్చింది (ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో వచ్చిందనుకుంటాను?)👇.
  కమ్యూనిస్టుల్ని ముమ్మరంగా అరెస్ట్ చేస్తున్న రోజుల్లో ఒకసారి అటువంటి మీటింగ్ బయట నిలబడున్న ఒక వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారట. ఎందుకనడిగితే కమ్యూనిస్టుల్ని అరెస్ట్ చెయ్యమని ఆదేశాలు వచ్చాయి అన్నారట పోలీసులు. మహాప్రభో, నేను ఏంటీ-కమ్యూనిస్టుని అని అతను మొరపెట్టుకున్నాడట. దానికి పోలీసులు ఏదో ఒక “కమ్యూనిస్టు”వి కదా, నడు నడు అని పట్టుకుపోయారట 🙂.

  మెచ్చుకోండి

HI, _/\_ :-) THANK YOU FOR COMING THIS FAR IN THE POST ;-) I REALLY DO APPRECIATE PEOPLE WHO STIMULATE MY CREATIVITY & MAKE ME THINK ON A DEEPER LEVEL. YOUR RATING THIS POST HELPS. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s