నో.వా.చే.రా

😊”మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మెరిసేదంతా బంగారం కాదు!!”😉 – ప్రధానిపై శాస్త్రజ్ఞుడి ప్రాక్టికల్ జోకు.

జవహర్లాల్ నెహ్రూ – ఒకప్పుడు ఈయన్ని అభిమానించిన జనాభా ఎంతో ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్న, కొండొకచో దూషిస్తున్న జనాభా దానికి రెట్టింపు వుండచ్చు. స్వాతంత్రం వచ్చినప్పట్నుంచీ జనాభా నాలుగు రెట్లు పెరిగిందన్న దాంట్లో డౌట్ ఏమీలేదు కానీ, జనంలో చరిత్ర పరిజ్ఞానం నాలుగు రెట్లు పెరిగిందా? నాలుగోవంతుకి పడిపోయిందా అనేది చెప్పడం కష్టం. ఇంత తేలిగ్గా ఎలా చెప్పేస్తున్నానంటే –

 1. అశోకుడి నుంచీ ఔరంగజేబు వరకూ ఎవరి చరిత్ర చూసినా గర్వపడేవాళ్ళు ఉన్నారు ఏమున్నది గర్వకారణం అనేవాళ్ళూ ఉన్నారు(పెరుగుతున్నారు).
 2. చిన్నప్పుడు చదివిన హిస్టరీ బుక్స్ అన్నీ అప్పటికే తిరగబడ్డాయనే విషయం అనుమానం స్థాయి నుంచీ పెనుభూతం సైజు వరకూ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా పెరుగుతోంది. చరిత్ర ఈ పాటికి ఎన్నిసార్లు తిరగరాయబడి వుంటుందా అనేది దీనికి అనుబంధ ప్రశ్నగా తలెత్తక తప్పదు. (మనసు లేని దేవుడు .. మనిషికెందుకో మనసిచ్చాడూ… ఊ..ఊ..ఊ..😂)
 3. History is but the version of the victor అని నెపోలియన్ అన్న మాటలు అప్పుడందరికీ తెలీవు. ఇప్పుడు చాలా మందికి తెలుసు.
 4. పై మూడు పాయింట్ల వల్ల హిస్టరీ అనేది మిస్టరీగా మారి కన్ఫ్యూజన్‌లో పడిపోయినవాళ్ళలో నేనూ ఒకణ్ణి.
 5. ఇంకోటి, ప్రజలు / సామాన్యులు అనబడే వోట్-బ్యాంకుల్లో హిస్టరీ తెల్సుకోవాలనే వైజ్ఞానిక ఆసక్తి ప్రత్యేకంగా వుందని చెప్పుకోడానికి తగిన ఆధారాలు కూడా పెద్దగా …. నెవర్ మైండ్..ఐనా, మెకాలే విద్యావిధానాన్ని ఇవాళ్టి చై.నా. విద్యావిధానం రిప్లేస్ చేస్తున్న ఈ రోజుల్లో చరిత్ర తిరగ రాసినా, మరగ రాసినా ఎవడిక్కావాలి?

సో, హిస్టరీ పరిజ్ఞానం పెరగలేదు కానీ మిస్టరీ/కన్ఫ్యూజన్‌  పెరిగిందనేది సొంత పర్సనల్ అభిప్రాయం. అంచేత నెహ్రూని — ఆ మాటకొస్తే చరిత్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళెవరి మీదా కూడా అభిప్రాయాలు ప్రకటించడం నా బోటి కన్ఫ్యూజ్డ్ మైండ్స్‌కి కుదరదు. సో, ప్రకటించను. కానీ – నెహ్రూకి, నోబెల్ బహుమతి సంపాయించిన మన సైంటిస్టు సి.వీ. రామన్‌కి మధ్య జరిగిన పిట్టకధ ఒకటి నెహ్రూ పాలిట భవిష్యపురాణంలా అనిపించింది. 1948లో నెహ్రూజీ రామన్ గారి లేబరేటరీ సందర్శనకి వెళ్ళినప్పుడు జరిగింది(ట) –

Raman Nehru

ఒక రాగితీగపై అల్ట్రావయొలెట్ కిరణాలు ప్రసరిస్తుండగా అది ప్రధానికి చూపించి అదే లోహమో చెప్పమన్నాడట శాస్త్రజ్ఞుడు. అల్ట్రావయొలెట్ కిరణాల ప్రభావంతో మెరుస్తున్న రాగి నెహ్రూజీకి బంగారంలా కనబడిందిట. ఆ మాటే అనేసాడాయన. “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మెరిసేదంతా బంగారం కాదు (Mr Prime Minister, everything that glitters is not gold),” అంటూ రామన్ కిరణాల ప్రసారం ఆపి రాగి తీగని చూపించాడట. ప్రధాని రియాక్షన్ ఏంటో తెలియదు కానీ రామన్ మాటలు చైనా విషయంలోనూ, వీకే మీనన్‌‌పై నమ్మకంతోనూ నెహ్రూ చేసిన పొరపాట్లని (🤔)  పదమూడేళ్ళ ముందే సశరీరవాణిలా వినిపించినట్టులేదూ? ఆయన కారెక్టర్లో ఏదో లోపాన్ని రామన్ పసిగట్టి ఒక ప్రధాని మీదే జోక్ పేల్చాడా? లేక అలాంటి జోక్స్ పేల్చడం ఆయన నైజమా? తెలీదు కానీ నెహ్రూ మాత్రం విమర్శనీ, వ్యంగ్యాన్నీ పాజిటివ్‌గా తీసుకునేవాడంటారు. శంకర్స్ వీక్లీలో తనపై పడిన పదునైన కార్టూన్స్‌ని చూసి ఆయన నవ్వుకునేవాడంటారు. అంటారా? నిజంగానే నవ్వుకునేవాడా? ఎవరికి తెల్సూ? హిస్టరీ ఈజ్ ఎ మిస్టరీ. హిస్టరీ & పాలిటిక్స్ పక్కనపెట్టి ఒక సైంటిస్టుకి, ఒక లీడర్‌కి మధ్య నడిచిన చమత్కారంగా చూస్తే చాలు.

బై4నౌ😉

 

 

 

30 thoughts on “😊”మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మెరిసేదంతా బంగారం కాదు!!”😉 – ప్రధానిపై శాస్త్రజ్ఞుడి ప్రాక్టికల్ జోకు.

 1. నెహ్రు గారికి సైన్స్ తెలియదనుకొందాము. అయినా రామన్ గారికి ప్రక్కన ఉన్నది ప్రధానమంత్రి అన్న విషయం మరిచి అలా జోక్ చేసిఉంటారని నేననుకోను. మనకి యెర్ర చొక్కాల వాళ్లు, ఆకుపచ్చ ఎరుపు కండువాలు వాళ్లు, నారింజ రంగు తలపాగాల వాళ్లు నేర్పించిన చరిత్రలా కాకుండా నెహ్రు గారు, వారి సమకాలికులు నిజాయతీగా, నిస్వార్థంగానే దేశసేవ చేశారనే చెప్పాలి (within their scope of influence, power, limitations and human frailties). ఎప్పుడో ఒక రోజు ఈ విషయం మీద టపా వ్రాయాలని నాకోరిక. మీ వ్యాసం ప్రథమ భాగంలోని వన్నీ సత్యాలే.


  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

 2. అన్యగామిగారు,
  //నెహ్రుగారు, వారి సమకాలికులు నిజాయతీగా, నిస్వార్థంగానే దేశసేవ చేశారనే చెప్పాలి (within their scope of influence, power, limitations and human frailties)// ఈ మాటతో పూర్తిగా ఏకీభవిస్తాను. నిజానికి ఈ సంఘటనకి సంబంధించిన వ్యాసంలో రామన్‌కి, నెహ్రూకి సైన్సు రీసెర్చి విషయంలో policy differences వుండేవనీ, ఆ నేపధ్యంలోనే రామన్ ఆ వ్యంగ్యబాణం విసిరి ఉంటాడనీ ధ్వనించేలా రాశారు.అంత అవసరమా అనిపించింది. ఒక స్కాలర్‌-లీడర్‌కి, ఒక గొప్పసైంటిస్టుకి మధ్య ఆ మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి చోటుండకపోదనే నా అభిప్రాయం.

  మెచ్చుకోండి

 3. ఆ వ్యాసకర్త trying to read too much between the lines అనిపిస్తోంది నాకయితే. లేదా wisdom after the event అయ్యుండవచ్చు — తరవాత కాలంలో నెహ్రూ గారి హయాంలో జరిగిన కొన్ని పరిణామాలను ఇప్పుడు విశ్లేషిస్తూ …. రామన్ గారి సరదా సంఘటనని నెహ్రూ గారి కారెక్టర్ “లోపాని”కి ఉదాహరణ అంటూ చిత్రీకరించే ప్రయత్నం అయ్యుండవచ్చు. ఆ వ్యాసం ఏమిటో…. లింక్ ఇస్తే మేమూ చదువుదామని “ఆత్రం”గా ఉంది.

  ఏ లోపాలున్నా (లేని మనిషెవరు) నెహ్రూ గారి సెన్సాఫ్ హ్యూమర్ కి మాత్రం మీరు చెప్పిన శంకర్స్ వీక్లీ కార్టూన్లని ఆయన కూడా ఆస్వాదించేవాడనీ, తననే lampoon చేస్తూ వేసిన కార్టూన్లు అయినా కూడా తనే ఫోన్ చేసి మెచ్చుకునేవాడనీ అంటారు.

  మెచ్చుకోండి

 4. ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని సామెత. సహజంగా సాగిపోయిన సంభాషణకి తరవాత కాలంలో మొలుచుకొచ్చిన వ్యాఖ్యానాలు.

  మెచ్చుకోండి

 5. “History is but the version of the victor అని నెపోలియన్ అన్న మాటలు” … నిజమేనని అనిపిస్తోంది కెసిఆర్ గారి “తెలంగాణా చరిత్రను తిరగ రాయిస్తాం” విన్నాక … వ్యాసంలో మీరు చూపిన 5 అంశాలు అక్షరక్షర సత్యం (ప్రస్తుత కాలానికి). “హిస్టరీ పరిజ్ఞానం పెరగలేదు కానీ మిస్టరీ/కన్ఫ్యూజన్ పెరిగిందనేది …” – ఇది మరింత నిజం.
  మీడియా రకరకాల దారులు తొక్కుతున్న ఇప్పటి పరిస్థితుల్లో వెల్లడవుతున్న అనేకానేక ప్రముఖుల/అప్రముఖుల వ్యక్తిగత/ప్రాయోజిత అభిప్రాయాలు/ప్రకటనలు చరిత్రపై ‘హిస్టరీయా ! మిస్టరీయా !’ లేక/మరియు ‘ఏది వైరల్ ఏది నిజం’ అన్న గందరగోళాన్నీ కలిగిస్తున్నాయి.
  బాగా వ్రాశారు yvr గారు …

  మెచ్చుకోండి

 6. ఆంధ్రభారతికిని అంతుబట్టని తెల్గు
  బామ్మ పద్య మందు పరిఢవిల్లు ,
  నారి కేల బడగ నారికేళం బైన
  వైన మేమి వింత ? వంత గాక !

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 7. “జిలేబి పాకము” 😀. భలే పదం coin చేశారండీ YVR గారూ 👌. ఇది జిలేబి గారికే పూర్తిగా proprietory అన్నమాట 🙂.

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

 8. కందము గాకున్నను , ఏ
  ఛందము లేకున్న నేమి సారూ ! పద్యం
  బందున ‘పాకం’బున్నది ,
  అందుననూ ‘బంక’లాగ అతికిందండీ !

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

 9. ఎవరిది “ఛందోరహిత” పద్యం 🙂? నా ఛందోపరిజ్ఞానం “పూర్ణం” 🙁.
  కొబ్బరి పీచు ఒలిస్తే రిజల్ట్ ఎలాగైనా వుండచ్చు కదా 🙂.

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

 10. హా! వింజోవిని పాదముల్గనుచు హాహాహాయనన్ మెత్తురే
  మో వీరెల్ల యనంగ హాళినిగనన్ మోగించిగా పాకముల్
  మోవుల్దీర్చి యిటన్, జిలేబి గనవే మోదమ్ము బోవంగ, హా !,
  వైవీయారుకు మంగళమ్మని జనుల్ వయ్యారముల్బోయిరే 🙂

  జిలేబి :)”

  https://polldaddy.com/js/rating/rating.js

  మెచ్చుకోండి

HI, _/\_ :-) THANK YOU FOR COMING THIS FAR IN THE POST ;-) I REALLY DO APPRECIATE PEOPLE WHO STIMULATE MY CREATIVITY & MAKE ME THINK ON A DEEPER LEVEL. YOUR RATING THIS POST HELPS. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s