🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

“మము పాలింపగ నడచి వచ్చిన” “పలుకులు బంగారాలై”న మీమాంసాబాలుడు!!

By

/

1 minute

read


“శ్రీరామనవMe శుభాకాంక్షలు” టైటిల్తో ఈ https://wp.me/p2uFNm-53o పోస్టు పెట్టానా, దాన్లోనే “ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవూ…” అని అన్నమయ్యని కోట్ చేశానా, వారం తిరక్కుండానే ఈ బాలరాముడు మా యింటికి వచ్చేశాడు (ఒకానొక సీతారామ కళ్యాణ కార్యక్రమంలో నిర్వాహకులు ఇచ్చిరి)…

మీమాంస తీర్చుకోడానికి వశిష్టులవారింటికి వెళ్ళాడో, లేదో…, వెళ్తే ఆయనేం చెప్పాడో… ఏంటో…

నా రామనవమి పోస్టు నచ్చి వచ్చాడా లేక ఏదైనా కామెంట్ చెయ్యాలని వచ్చాడా. ఎప్పుడు సెలవిస్తాడా అని ఎదురు చూస్తున్నా. ఈ “పలుకే బంగారం” స్వామి ఎప్పటికి నోరు విప్పి పలుకుతాడో తెలీదు, అసలే బంగారం ధరలు పెరిగిపోతున్నాయిట… ధరలు దిగొచ్చేదాకా పలుకులు పొదుపుగా వాడాలని స్వామివారనుకుంటే ఏంచెయ్యగలం, వేచి చూడడం తప్ప..😊🙏

One response to ““మము పాలింపగ నడచి వచ్చిన” “పలుకులు బంగారాలై”న మీమాంసాబాలుడు!!”

  1.  Avatar
    Anonymous

    బంగారం ఎంత వంద దాటిందాండీ 🙂

    Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)