నో.వా.చే.రా

😊”మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మెరిసేదంతా బంగారం కాదు!!”😉 – ప్రధానిపై శాస్త్రజ్ఞుడి ప్రాక్టికల్ జోకు.

జవహర్లాల్ నెహ్రూ – ఒకప్పుడు ఈయన్ని అభిమానించిన జనాభా ఎంతో ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్న, కొండొకచో దూషిస్తున్న జనాభా దానికి రెట్టింపు వుండచ్చు. స్వాతంత్రం వచ్చినప్పట్నుంచీ జనాభా నాలుగు రెట్లు పెరిగిందన్న దాంట్లో డౌట్ ఏమీలేదు కానీ, జనంలో చరిత్ర పరిజ్ఞానం నాలుగు రెట్లు పెరిగిందా? నాలుగోవంతుకి పడిపోయిందా అనేది చెప్పడం కష్టం. ఇంత తేలిగ్గా ఎలా చెప్పేస్తున్నానంటే – అశోకుడి నుంచీ ఔరంగజేబు వరకూ ఎవరి చరిత్ర చూసినా గర్వపడేవాళ్ళు ఉన్నారు ఏమున్నది గర్వకారణం అనేవాళ్ళూ … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

🌏మట్టిబుర్ర🌦లో 🌱మొలిచిన🌱ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ఐడియాలతో…. A sequel to “అమరావతిలో (సిని)మాహిష్మతి”

మొన్న🚅 🌇అమరావతి🌇✈ లో 🏰🏯(సిని)మాహిష్మతి🏯🏰 పోస్టు రాసి అలా ఇంతే సంగతులు చెప్పానో లేదో జిలేబిగారు “అదురహో” అంటూ ఆశుకవితాస్రవంతి ప్రవహింపజేశారు, పన్లో పనిగా “ఉదరావర్తం” అనే దర్శకేంద్రుడు తప్ప ఎవరూ అర్ధం చెప్పలేని పదం ఒకదాన్ని జనజీవన స్రవంతిలోకి లాక్కొచ్చేసారు. ఈ పదం గురించి వీఎన్నార్ సారూ, నేనూ ప్రశ్నా/సందేహ వృష్టి కురిపించడంతో జిలేబిగారు స్పందిస్తూ అత్యంత అరుదుగా వచ్చే తమ స్పెషల్ ప్ర”వచన” టపాలలో ఒకదాన్ని “ఉదరావర్తం”అంటే సాముద్రిక లక్షణమని వివరిస్తూ వెలువరించారు. ఇందులోనే భాగంగా … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

🚅 🌇అమరావతి🌇✈ లో 🏰🏯(సిని)మాహిష్మతి🏯🏰

సినీనటులు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరని ఎమ్జీయారూ, ఎన్టీయారూ, పురచ్చితలైవి… ఇలా చాలా మంది ప్రూవ్ చేసేశారు. డైరెక్టర్ల దగ్గిరికొస్తే దాసరిగారు ఓ పక్క సినిమాల్లో  కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం-మాటలు-పాటలు-నటన, ఇంకోపక్క పత్రికలూ, మూడోపక్క మంత్రిత్వం చేస్తూ లిటరల్లీ అష్టావధానం చేసేశారు. ఆ తరవాత వెరైటీగా ఉంటుందని పుష్కరాల డైరెక్షన్‌కి ఒకాయన్ని తీసుకొచ్చారు. ఆ మధ్య జరిగిన గోదావరి పుష్కరాలకి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ ఆగమశాస్త్రోక్తంగా ఒక డైరెక్టర్‌గారు చేశారు. నై, నై చేయించబడ్డారు. జనం కనుబొమలెగరేశారు ముందు. తరవాత, “భగవంతుడికి, భక్తుడికి … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

(1)స్వ+ఇచ్ఛ=స్వేచ్ఛ=one’s own liberty(2) రామూ-హనుమ యుద్ధం(3) ఒకడికి వాగడం స్వేచ్ఛ, ఇంకొకడికి “ఉతకడం” స్వేచ్ఛ

మొన్న ఫ్రీడం గురించి రాసిన గాంధీగారి🙈🙉🙊కోతులు + 3 కొత్త🐒🐵🐒 కోతులు Monkey’s Message😉 to its Cousins😆 పోస్టుకిది సీక్వెల్. ఈ సీక్వెల్ రాయడానికి స్ఫూర్తి ఆ టపా మీద వ్యాఖ్యలు చూసినప్పుడే వచ్చింది. సబ్జెక్ట్ మీద కాక భాష మీద భలే భలే ఇంటరెస్టింగ్ కామెంట్స్ బోల్డు వచ్చాయి. సరే కామెంటర్ల స్వేచ్ఛ కామెంటర్లది అనుకున్నా. అనుకుని అప్పుడే సీక్వెల్ సగం రాసేశా. కానీ పోస్టు చెయ్యడానికి సరైన సందర్భం ఇప్పుడొచ్చింది. అదేంటో చెప్పక్కర్లేదు. ఈసారి, హోప్ఫుల్లీ, సబ్జెక్ట్ మీదే కామెంట్స్ … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

క్లియరసిల్ అమ్మాయి మొహంపై మొటిమల్లా ; దిష్టిగుమ్మడికాయ మీది చారల్లా; నక్సలైట్లకి అధికారం యిచ్చే తుపాకీగొట్టంలా; ఇసకమాఫియా తవ్వేసిన గోతుల్లా….

ఈ ప్రపంచానికో దుర్గుణం వుంది. ఏ ఒక్క కంటికీ ఒక్కలా కనబడదు. టెర్రరిస్టులకీ, ఛాందసవాదులకీ, పెద్ద మార్కెట్ కేపిటలిస్టులకీ తప్ప. ఇంక మిగిలినవాళ్ళు మనుషులు. వీళ్లకి సంబంధించినంత వరకూ మాత్రం – చూసే కంటిని బట్టి ప్రపంచ స్వరూపం మారిపోతావుంటది. నీళ్ళు గ్లాసులో పోసినప్పుడు గ్లాసు షేపు లోనూ, తొట్టెలో పోస్తే తొట్టె ఆకృతిలో, ఎందులోనూ పోయ్యకపోతే వాటిష్టం వచ్చిన ఆకారంలోనూ – ఇలా రకరకాల రూపాల్లో కనపడినట్టే ఈ ప్రపంచకం గూడా వేరు వేరు విధాలుగా … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

Statutory Warning – “మాస్టారూ! మీ సొంత రిస్కు మీద బాబాలని, దేవదూతల్ని, స్వయంప్రకటిత దేవుళ్ళని ఫాలో అవుతున్నారు. ఫ్యూచర్లో వాళ్ళు బురిడీలని…..”

దేశంలో బాబాలు, గురువులు, రెండుమూడు వేల ఫీజుకి దేవుళ్ళని డెడ్ చీపుగా ప్రత్యక్షం చేసేసే “సిద్ధు”ల వరకూ లెక్కలేనంత మందీ, వీళ్ళ కృపాకటాక్షవీక్షణాలకోసం, అవి తమ మీద ప్రసరిస్తే లభించే లక్షలూ, మోక్షాల కోసం పడిగాపులు పడే అంతకంటే లెక్కలేనంత మంది “అమాయక” జనం(ఆ కోట్స్ ” ” ఎందుకో ఆ కింద రాశా) వున్నారు కదా. ఆ బాబాలు బురిడీలో కాదో తెలీకుండానే ఈ “అమాయక” జనాభా వాళ్ళ పాదపద్మాల మీద పడిపోడం, వాళ్ళు భక్తిపారవశ్యంలోంచి … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

2020 నాటికి చందమాఁవగారింట్లోగానీ, 2025 నాటికి కుజ బాబాయిగారింట్లోగానీ తిష్ట వేసెయ్యకపోతే….

స్టీఫెన్ హాకింగ్ ఆ మధ్య ఎప్పుడో ఇచ్చిన ఒక స్టేట్మెంటు ఈ మధ్య ఎక్కడో చదివా. హాకింగ్ ప్రకారం భూమ్మీద మానవజాతికి నూకలు చెల్లిపోయే సమయం దగ్గరపడిపోతోంది. యాస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టడం వల్లో, అంతులేకుండా పెరిగిపోతున్న పొల్యూషన్ వల్లో, ఈ రెండూ కాకపోతే సూర్యగోళం అంతరించే క్రమంలో పుట్టే వేడికి భూమి ఆవిరైపోవడంవల్లో నరజాతికి ప్రమాదం పొంచి వుంది కనక అర్జెంటుగా 2020 నాటికి చందమాఁవగారింట్లోగానీ, 2025 నాటికి కుజ బాబాయిగారింట్లోగానీ తిష్ట వేసెయ్యకపోతే మనుషుల … చదవడం కొనసాగించండి

Rate this: