Latest Entries
నో.వా.చే.రా

NASAలో బాహుబలి టెక్నాలజీ? ఏమిటా ప్రాచీన సంక్లిష్ట సాంకేతిక దేవరహస్యం? (Note: To experience this post better, see బాహుబలి-2 first 😊 )

ఇది అర్ధం అవ్వాలంటే బాహుబలి సినిమా, కనీసం పార్ట్ టూ, చూసి వుండాలి. లేకపోతే దుర్గ్రాహ్యమైన ఈసాంకేతిక పరిజ్ఞానం అంటే కాంప్లికేటెడ్ టెక్నాలజీ పట్టుబడదు. దానికి తోడూ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ ఎలక్ట్రానిక్ స్క్రీన్ మీద వ్రాయడం, ఆ సమయంలో ఫ్లైట్‌కి టర్బులెన్స్ ఎక్కువగా ఉండడంతో వేదాల్లో వున్న వైమానిక శాస్త్రంలా క్లిష్టంగా, అస్పష్టంగా తయారైంది. అందువల్ల సినిమా చూసి ఆపైన ఇది చూస్తే బెటరు. ఫ్లైట్‌కి టర్బులెన్స్ రావడంలో వున్న రహస్యం ఏమిటో  ఇప్పుడర్ధం ఔతోంది. అడుగున రాశాను. … చదవడం కొనసాగించండి

Rate this:

టీకప్పులో ట్సునామీ

😇 పిచ్చికుక్కల్ని చంపడం తప్పు. వాటికి మనుషుల విలువేంటో అర్ధమయ్యేలా చెప్పాలి కానీ కుక్కలబండిలో పడెయ్యకూడదు. వాటి పిచ్చిని అవి తెలుసుకునే అవకాశం వాటికివ్వాలి….😇

నిర్భయ కేసు నిందితులకి పడ్డ ఉరిశిక్షల్ని సుప్రీంకోర్టు కన్‌ఫర్మ్ చేశాక ఒక సెలబ్రిటీ అభిప్రాయం ఇలా బైటపడింది –”నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష విధించడం తప్పు. వాళ్లకు స్త్రీ విలువేంటో అర్థమయ్యేలా చెప్పాలి తప్ప, ఉరిశిక్ష విధించడం కరెక్ట్ కాదు. తమ తప్పు తెలుసుకునే అవకాశం వారికివ్వాలి.” బానేవుంది కదా!! కాదు బ్రహ్మాండంగా వుంది. ఎవరికీ? మృగాళ్ళకి + మేధోశక్తి ఎక్కువైపోయి, ఓవర్-ఫ్లో ఐపోతున్నవాళ్ళక్కూడా. నాకు జంతువులంటే ఇష్టం. వాటి మీద కరుణ, ప్రేమ చూపించడమన్నా, అలా … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

😇జీ(వి)తం=జీ(వితం)=(జీవి)తం😇 ; …..బలుసాకు🌿తినో, బాహుబలి-2 💪 చూసో……

ఇవాళెందుకో జీవితం అనే పదం మీద అనుకోకుండా దృష్టి పడింది. ఎంత అనుకోకుండా అంటే దానికి యాదృచ్చికం అనే మాంఛి బరువైన పదం వాడేయ్యచ్చు. నిజానికి కాకతాళీయం వంటి దృష్టాంతవిశేషాన్ని కూడా జతపరిచి మరీ వాడచ్చు. అంత యాదృచ్చిక-కాకతాళీయమంత అనుకోకుండా జీవితాన్ని, ఐ మీన్ ఆ పదాన్ని, మూడుముక్కలు చెయ్యాలనిపించింది. జీవి, వితం, జీతం. ఏంటీ గోల? శంకరాభరణంలో దాసు మేష్టారు చేసే సంగీత ప్రయోగాల్లా ఈ భాషా ప్రయోగాలేంటి అనిపిస్తోందా? ఏమనిపించినా ఏం లాభం లేదు. … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

😉బాహుబలి ఎఫెక్ట్ (ట్రంప్ మీద, పాకిస్తాన్ మీద)😉

బాహుబలికి కల్ట్ స్టేటస్ వచ్చేసింది. ఎంతంటే ఆ స్టేటస్ చూసి ముక్కున వేలేసుకుందామంటే ఒక ముక్కు , దానిపై ఒక వేలు సరిపోవట్లేదుట. పోనీ మొత్తం పదివేళ్ళూ ముక్కున వేసుకున్నా అదీ చాలట్లేదుట. పదిముక్కులు, రెండొందలవేళ్ళతో రావణాసురుడో; ఒక ముక్కు, పదివేల వేళ్ళు వున్న కార్తవీర్యార్జునుడో తప్ప మామూలు మనుషుల వల్ల కావట్లేదుట. కలెక్షన్స్‌లో హాలీవుడ్ సినిమాల్ని తుంగలో తొక్కేసిన బాహుబలిని చూసి ‘అమెరికా’లకేయుడు ట్రంప్ జడుసుకుని తెలుగు సినిమాలు – అవి స్ట్రైట్ తెలుగు సినిమాలు … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

నోవాచేరా గురించి… అస్సలేం _పనిలేక_పోతే, బోల్డన్నికాలక్షేపం కబుర్లుకాకరకాయల_తో మధ్య మధ్య ఓ _జిలేబి_ నోట్లో పడేసుకుంటూ…

నాలాంటి ఎక్స్ట్రా ఆర్డినరీలీ-ఆర్డినరీ బీయింగ్ కి  అస్సలేం _పనిలేక_పోతే, బోల్డన్ని (కాలక్షేపం) కబుర్లుకాకరకాయల_తో మధ్య మధ్య, for a change, ఓ _జిలేబి_ నోట్లో పడేసుకుంటూ గడిపెయ్యాలి అంతే, కానీ నేనూ రాస్తానంటూ ఓ బ్లాగు తెరవడం అందులో టపాలు వెయ్యడం అనే పుణ్యకార్యం మొదలెడితే?? అప్పుడుగానీ రాయడం ఎంత కష్టమో తెలీదు. ఊరికిముందు ఒకో రకం టపాకి ఒకో వర్గం – కేటగిరీలు- కేటాయించేసి  – ఏదో రాసేస్తామని మహచెడ్డ కాన్ఫిడెన్సు – వాటికి మాంఛి పేర్లు, … చదవడం కొనసాగించండి

Rate this:

నో.వా.చే.రా

స్పీల్‌బర్గ్‌లా సినిమా తియ్యలేదని విఠలాచార్యని విమర్శించడంలో అర్ధం వుందా? ఎస్వీరంగారావుకి, ప్రకాష్‌రాజ్‌కి ఘటోత్కచుడి పాత్రపోషణలో పోటీ పెట్టొచ్చా?

ఒక కళాతపస్వికి ఆ కళకి ఆద్యుడైన కళాయశస్వి పేరిట అవార్డ్ ఇస్తే అది ఆ యశస్వికి గౌరవమా? ఈ తపస్వికి గౌరవమా? రెండూ కాదు. దేశం ఒక కళారూపాన్ని ఆదరించి దానికి ఆద్యుడైన వ్యక్తి పేరిట ఆవార్డు నెలకొల్పి, ఆ కళని సుసంపన్నం చేసిన వ్యక్తికి ఆ అవార్డ్ యిస్తే అది – 💐 ఆ కళారూపానికి ఈ దేశం, దేశప్రజలు ఇచ్చే విలువ, చూపించే గౌరవం. 💐 దేశపు అభిరుచి ఏమిటి, ఎలావుండాలి అనేదానికి మనం ఇచ్చుకునే నిర్వచనం. … చదవడం కొనసాగించండి

Rate this:

హృదయాం'తరంగం'

K…V = Kaళాతపస్V = Kaళాతపస్Vశ్వనాధ్ = కళాతపస్విశ్వనాధ్ 🙏

K_ _ _ _ V = Kaళాతపస్V = Kaళాతపస్Vశ్వనాధ్ = కళాతపస్విశ్వనాధ్ ఎందరో అభిమానులు, కళాభిమానులు, మహానుభావులు ఆ కాశీనాధుడి సొంతమనిషైన – కాశీనాధు”ని” విశ్వనాధ్ కదా మరి😊 – ఈ కళాతపస్వి గురించి చెబుతుంటే, ప్రశంసలు కురిపిస్తుంటే నేను ఏం చెయ్యలేదే అని నాకనిపిస్తుందని అలా అనిపించకూడదని ఏదో ఇలా స్వహస్తాలతో రాసుకున్న ఉడతాభక్తి  –  వేదసారం శంకరాభరణరాగంలో సిరిసిరిమువ్వల నాదాలే శృతిలయలుగా సిరివెన్నెలలా సాగరసంగమ ప్రదేశాన వర్షించినపుడు ఆవిర్భవించిన అరుదైన స్వాతిముత్యం మన … చదవడం కొనసాగించండి

Rate this: