🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

🚅 🌇అమరావతి🌇✈ లో 🏰🏯(సిని)మాహిష్మతి🏯🏰

By

/

2 minutes

read


సినీనటులు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరని ఎమ్జీయారూ, ఎన్టీయారూ, పురచ్చితలైవి… ఇలా చాలా మంది ప్రూవ్ చేసేశారు. డైరెక్టర్ల దగ్గిరికొస్తే దాసరిగారు ఓ పక్క సినిమాల్లో  కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం-మాటలు-పాటలు-నటన, ఇంకోపక్క పత్రికలూ, మూడోపక్క మంత్రిత్వం చేస్తూ లిటరల్లీ అష్టావధానం చేసేశారు. ఆ తరవాత వెరైటీగా ఉంటుందని పుష్కరాల డైరెక్షన్‌కి ఒకాయన్ని తీసుకొచ్చారు. ఆ మధ్య జరిగిన గోదావరి పుష్కరాలకి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ ఆగమశాస్త్రోక్తంగా ఒక డైరెక్టర్‌గారు చేశారు. నై, నై చేయించబడ్డారు. జనం కనుబొమలెగరేశారు ముందు. తరవాత, “భగవంతుడికి, భక్తుడికి అనుసంధానం ఎవరు? ఒకప్పుడు పూజారులు, పురోహితులూ. కొంతకాలానికి ఆ స్థానాన్ని అంబికాదర్బార్ బత్తీ ఆక్రమించేసింది. ఇప్పుడిక సినిమా డైరెక్టర్ల వంతన్నమాట,” అనుకుని సద్దుకున్నారు.

సమాజంలో అన్ని రంగాల్నీ సినిమా, సినిమావాళ్ళూ ప్రభావితం చేసేస్తుంటే రాజధాని నిర్మాణాన్ని ఎందుకు చెయ్యకూడదు అనిపించిందో ఏమో ఇప్పుడింక రాజధాని డిజైన్ కూడా సినిమాడైరెక్టర్లే చెయ్యాలని శ్రీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ మధ్య తెలుగు చలనచిత్రాల చరిత్రనే తిరగరాసేసిన రెండుభాగాల సినిమా తీసిన ఆ డైరెక్టరే అమరావతిని డిజైన్ చేస్తే ఆం.ప్ర. చరిత్ర కూడా తిరగరాయబడుతుందనో ఏమో తెలీదు కానీ, “సినీజనుల్ చేయగరాని పని యున్నదే ముద్దార చేచేయించినన్?,” అంటూ ఆ డైరెక్టర్ గారికి రాజధాని డిజైన్ బాధ్యత అప్పజేప్పేసారు. ఆయనేమో నాకా సబ్జెక్టస్సలు తెలీదర్రోయ్ అంటున్నా సరే. ఎలా డిజైన్ చేస్తారో ఏంటో అదంతా ఆయన తలనెప్పి కానీ, మన వంతుగా, ఆ ఇంటర్నేషనల్ బ్లాక్-బస్టర్ రెండు భాగాలూ చూసేసిన బాధ్యతగల పౌరులుగా, అమరావతిలో సిని’మాహిష్మతి’ ఎలా పరకాయ ప్రవేశం చేస్తుందో ఊహించుకోవచ్చు. అదే ట్రై చేశానిక్కడ నా గెలాక్సీ నోట్ 5తో. ఐతే, ముందుగా ఇంకో ఇద్దరు సీనియర్ డైరెక్టర్స్ కూడా రాజధాని డిజైన్ చేస్తే ఎలా వుంటుందో చూసి ఆ తర్వాత సూపర్ డూపర్ డైరెక్టర్‌’స్ డిజైన్ చూద్దాం.

మొదటగా – తెలుగుదనాన్ని, కొంటెబొమ్మల్ని, రాములవారిపై భక్తినీ ప్రతి సినిమాలో ప్రకటించే ఆంధ్రుల అభిమాన డైరెక్టర్ ఒకరు డిజైన్ చేస్తే ఇలా👇 ముగ్గులూ, గొబ్బెమ్మలూ, కుటీరాలతో ఉంటుందేమో  –

1

ప్రపంచంలో ఎవరికైనా సగం కొరికిన యాపిల్ పండుని చూస్తే స్టీవ్‌‌ జాబ్స్ ఎలాగైతే గుర్తోస్తాడో, యాపిల్స్, ద్రాక్షపళ్ళూ చూస్తే ఒక సినీడైరెక్టర్ గుర్తొస్తారు. మునుల తపస్సులు భంగం చెయ్యడమే పనిగా పెట్టుకున్న ఒక దేవతపేరు ఆయనకి బిరుదైయ్యింది. అందుకేనేమో యాపిల్స్, ద్రాక్షలూ హీరోయిన్ల మీదకి విసురుతూ సారీ, విసిరిస్తూ  (సినిమాల్లోనే లెండి) ప్రేక్షకుల మతులు చెడగొడుతూ సార్ధకబిరుదాంకితుడైన ఆయన డిజైన్ చేసిన కేపిటల్ సిటీ (దానికీ, ఈయన బిరుదనామానికి విడదీయరాని బంధం) బోర్లించిన బిందెల్లాంటి బిల్డింగ్సూ, పరిచిన రంగురంగుల చీరల్లా కనిపించే రోడ్లతో, అక్కడక్కడా ఎర్రటి యాపిల్సూ (కొన్ని కొరికినవి, కొన్ని కొరకనివి), పంచరంగుల గొడుగులతో… ఇలా 👇 వుంటే ఎవరూ ఆశ్చర్యపోరు –

2

ఫైనల్లీ, ఇప్పుడు నిజంగానే అమరావతిని డిజైన్ చేహేస్తున్నడైరెక్టర్‌గారి డిజైన్లు ఇలాగే 👇 వుండాలని ఆయన అభిమానులం కోరుకుంటే, ఊహించుకుంటే తప్పులేదు. ఎందుకంటే తన సినిమాలతో డోనాల్డ్ ట్రంప్‌కే గుండెదడ పుట్టించిన (పుట్టించాడు(ట) మరి) ఆయన డిజైన్ చేసిన కేపిటల్ సిటీ ఆ మాత్రం ఇదిగా వుండొద్దూ? వుండాలి.

3

5

4

6

ఇంకొక విషయం. అసెంబ్లీ భవనం చుట్టూ కనుచూపు మేరలో తాటిచెట్లు లేకుండా జాగ్రత్త పడతారు ఈ డిజైన్‌లో. ఎందుకంటే ప్రతిపక్షాలవాళ్ళు ఎలక్షన్స్‌లో గెలవకపోయినా తాటిచెట్ల మీంచి మిసైల్స్ లాగా లాంచింగ్ అయిపోయి అసెంబ్లీలోకి వచ్చెయ్యకుండా అన్నమాట.

ఇంతేసంగతులు. బై4నౌ. 😆

 

 

 

 

 

18 responses to “🚅 🌇అమరావతి🌇✈ లో 🏰🏯(సిని)మాహిష్మతి🏯🏰”

  1. anyagaami Avatar
    anyagaami

    మీరెందుకో రెండో దర్శకుడి డిజైన్ మీద ఎక్కువ శ్రద్ధ చూపలేదు. మొదటి డిజైన్లో ఆంజనేయస్వామిని భలే సెట్ చేశారు. తాటిచెట్లు లేకుండా చేయటం మంచి ఏర్పాటు.


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      అన్యగామిగారు, థాంక్యూ. నిజమే రెండో దర్శకుడి డిజైన్ సరిగ్గా కుదరలేదు. కొంచెం మొహమాట పడ్డాను. జిలేబిగారు వాడిన ‘ఉదరావర్తము’ అనే పదం చూశాక డిజైన్ మాడిఫై చెయ్యచ్చనిపిస్తోంది. 😆

      Like

  2. Zilebi Avatar
    Zilebi

    అదురహో ! అమరావతి!
    అదురహో వనవాటికా రాజధాని
    అదురహో ద్రాక్షతోటల రంగుచీరల ఉదరావర్తము!
    అదురహో బాగ్ బలి 🙂
    అదురహో వైవీయార్ 🙂
    జిలేబి


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      //ఉదరావర్తము// జిలేబిగారూ, ఇప్పుడే నానార్ధాలు చూశాను. మొదటిది ఇక్కడ అప్లై అవదు కానీ, అదేంటి అంత షాకింగ్ & సంచలనాత్మకంగా వుంది? అత్తామామలని చంపేవాళ్ళు ఆ గుర్తులు వేసుకుని మరీ పుడతారా? OMG!!!

      Like

  3. Chandrika Avatar
    Chandrika

    మీ బొమ్మలు భలే ఉంటాయండీ 🙂 . సినిమా పిచ్చి మనవాళ్ళకి ఇంతదాకా వచ్చినందుకు చాలా సంతోషం 😦

    Like

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      థాంక్యూ చంద్రికగారు🙏. ఇవాళీ బొమ్మలు వేసినా, పోస్ట్‌లు వ్రాసినా ఆ సినీపిచ్చితల్లి దయే!😆

      Like

  4. వెంకట రాజారావు . లక్కాకుల Avatar
    వెంకట రాజారావు . లక్కాకుల

    సారూ ! వైవీయరూ !
    మీరైతే అమర పురపు మేలు డిజైనుల్
    తీరిచిన నెటువ లుండునొ
    సారించి రచించ – చూడ జర మనసయ్యెన్

    Liked by 1 person

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      @వెంకట రాజారావు, లక్కాకుల గారు
      సర్,
      సారూ,గారననేలా? వైవీ
      యారూ అని పిలిచినచాలును
      సారూ! మీరే నిజమున సారు, మా
      🌟స్టారూ🌟, మాస్టారూ 🙏

      అమరపురి రచనకు నాకూ అవకాశం ఇచ్చారు, తప్పక ప్రయత్నించి పోస్టు అప్-డేట్ చేస్తాను మాస్టారు.

      Like

  5. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    జిలేబి గారూ, “ఆంధ్రభారతి” వారు మీకు Preferred Customer స్ధాయి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. ముందస్తు అభినందనలు 👏 🙂.
    మాబోటి సామాన్య మానవులకు (lesser mortals అందామా ?) అర్ధమయ్యే తెలుగు వ్రాయరాదూ ఇకనైనా ? ప్లీజ్ …


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

  6. Lalitha TS Avatar
    Lalitha TS

    మీది ఖచ్చితంగా ఇల్లస్ట్రేటెడ్ బ్లాగ్లీ 👏

    https://polldaddy.com/js/rating/rating.js

    Liked by 1 person

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      👌👌 nice caption,😊 Thankyou andi.

      Like

  7. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    < " అత్తామామలని చంపేవాళ్ళు ఆ గుర్తులు వేసుకుని మరీ పుడతారా? OMG! "
    😳😳. ఆ "గుఱుతు"లు ఎలా ఉంటాయో తెలిస్తే క్షేమదాయకమూ, ఉపయోగమూ కదా YVR గారూ. ఎవరి జాగ్రత్తలో వారుండవచ్చు. బహుశః టీవీ సీరియళ్ళలో చూపించినట్లు నుదుటన పాము ఆకారపు బొట్లు పెట్టుకునుంటారో ఏవిటో?

    "ఉదరావర్తము" కి ఆంధ్రభారతిలో ఇచ్చిన అర్ధాలలో మిగతావాటితో ఇది పొసగటం లేదు. అలాగే ఈ పదానికి ఆంధ్రభారతిలో బ్రౌణ్యం గాని, శంకరనారాయణ గానీ లేదు, గమనించారా?

    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      విన్నకోట వారు, జిలేబిగారు ఉదరా వర్తాన్ని మొదటి అర్ధం వదిలేసే వాడారు. ఐతే నాది హిస్టారికల్ ఇంట్రెస్టు. ఇది చూస్తే ప్రాచీన పదంలా వుంది. ఆనాటికే ఇలాంటివాళ్ళు ఉండడం, వాళ్ళని గుర్తించే పద్ధతులు ఉండడం చూస్తుంటే మహా మిస్టరీగా వుంది. ఈ లెక్కన కోడళ్లని కిరసనాయిలు పోసి …… పే వాళ్ళకీ ఏవో గుర్తులుండే ఉండాలి. రీసెర్చ్ అవసరం.🤗😀

      Like

  8. Zilebi Avatar
    Zilebi

    వామ్మో ! అత్తా మామల చంపే స్త్రీ ల సాముద్రికా లక్షణాల మీద ఇంత మక్కువ ఉందా 🙂

    ఆంధ్ర భారతి వారి ఓపిక కి మెచ్చు కోవాలి అవన్నీ పట్టి తమ లిస్టు లో పెట్టేసు కోవడానికి 🙂

    బృహత్ సాముద్రికా లక్ష్మణ శాస్త్రం ప్రకారం ఉదర లక్షణా లలో ఒకటి ఇట్లాటిది; కానీ దానికి ఆంధ్ర భారతి వారెలా ఉదరావర్తానికి లింకు పెట్టారో తెలియదు ; (వారికి ఉదర + ఆవర్తము – అన్న అర్థం లో తోచి ఉండ వచ్చను కుంటా 🙂 ఆవర్తము – శరీరమందలి సుడి )

    బృహత్ సాముద్రికా లక్షణం – ఉదర లక్షణం

    “ప్రలంబజఠరా హంతి శ్వశురం చాపి దేవరం” !

    (మావయ్య + బావమరిది పాపం వీడూ డమాలే 🙂

    For those to read the full bruhat samudrika shastra refer to the blok (enjoy maadi:)
    (Refer to the chapter on Udara).

    https://archive.org/details/bruhatsamudrikas035840mbp

    ( మన దేశవాళి కన్నీ బృహత్ ఉండాలి 🙂 – ఆ తరువాయి లఘు అని ఎవరైనా వ్రాయాలి – ఆ తరువాత దానికి భాష్యాలు వ్రాయాలి ; ఆ తరువాయి టీకా “టాట్” పర్యాయాలు వ్రాయాలి అప్పుడే విశదీకరణ అవుతుంది ; ఆ పై ఏ అమెరికా వాడో ఐరోపా వాడో దాన్ని ఆంగ్లం లోనో ఐరోపా భాషల్లో నో తర్జుమా చేసేసుకుని, పేటంటు రైటు కొట్టేసు కుని మరో కొత్త తెక్నీకు కన్బట్టేస్తాడు 🙂

    చీర్స్
    జిలేబి

    https://polldaddy.com/js/rating/rating.js

    Liked by 1 person

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      Thanks for the info.😃. స్ట్రాంగ్ మార్కెట్. ఏదైనా ఛానల్ లో దుకాణం తెరవచ్చేమో !! పాకేజ్ లో గవ్వల పంచాంగం, చిలక జోతిష్యం +ఫ్రీ కవచం ఆఫర్ చేస్తే ఢోకా లేని కెరీర్.

      Like

  9. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    మీకు, మీ కుటుంబానికీ విజయదశమి శుభాకాంక్షలు, YVR గారు 🌹.


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      విన్నకోట వారు, ధన్యవాదాలు. మీకు, కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.🌷🙏

      Like

  10. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    Etymology నాకూ ఇంటరస్టే YVR గారూ. ఇది సింపుల్ గా “ఉదర + ఆవర్తము” = శరీర మధ్యభాగంలో సుడి = నాభి, బొడ్డు అన్నదే సబబనీ, పైగా “ఉదరావర్త” అనే సంస్కృత పదానికి Monier Williams Sanskrit-English Dictionary కూడా “stomach-coil, the navel” అనే అర్ధమే సూచిస్తోందనీ, మరి ఆ శ్యామలకామశాస్త్రి గారి నిఘంటువులో మాత్రం (ఆంధ్రభారతిలో చూపించినవి) ఈ పదానికి అర్ధం ఆడవిలన్ల లక్షణం అంటూ ఎలా వచ్చిందో, వగైరాలతో వ్యాఖ్య పెడదామనుకుని, కొంత తయారు చేసి, నిద్ర రావడంతో పొద్దున ముగిద్దాంలే అనుకున్నాను. ఉదయానికల్లా జిలేబి గారు beat me to it, ఏకంగా టపాయే పెట్టేసారు. ఎంతైనా erudite వ్యక్తి కదా 🙂👏.

    https://polldaddy.com/js/rating/rating.js

    Like

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)