🌊అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ కోరాడగ 🌊

వాట్సాప్ప్ ముచ్చట్లు (2) – N.A.S.A🚀 కృష్ణ🙏 N.A.S.A 🚀కృష్ణ🙏||కృష్ణ🙏 కృష్ణ🙏 N.A.S.A 🚀N.A.S.A🚀

By

/

2 minutes

read


వాట్సాప్‌లో  ఒక నమస్కారం + ఆనందభాష్పాల ఎమోజీతోపాటు “ప్లీజ్ ఫార్వర్డ్ టు యాజ్ మెనీ యాజ్ పాజిబుల్. లెట్ ఎవ్విరివన్ అండర్‌స్టాండ్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ అవర్ కల్చర్” అని వెనకాలే పదో, పన్నెండో🙏 లు తగిలించుకుని వచ్చిన ఆ మెసేజ్ వల్ల గ్రూపు మెంబర్లలో –

  • కొందరికి ఆనందభాష్పాలు ఇన్నాళ్ళకి జనం “గ్రేట్‌నెస్ ఆఫ్ అవర్ కల్చర్” రియలైజ్ అవుతున్నారు కదా అని

  • కొందరికి దుఃఖాశ్రువులు “మేం ఎన్నాళ్ళనుంచో నెత్తీ నోరు బాదుకుని మరీ ఇదే చెప్తుంటే ఇప్పటికా గుర్తించేది?,” అని

  • నేను పెట్టాలనుకున్న మెసేజి ఇంకెవరో పెట్టేశారనే నిరాశాభాష్పాలు కొందరివి;

  • వీళ్ళనీ, ఈ దేశాన్నీ ఎవరూ బావుచేయ్యలేరనే సెక్యులర్ అసహన అశ్రువులు ఇంకొందరివి;

  • ఈ దెబ్బతో కుహనా సెక్యులరిస్ట్‌లు కుదేలౌతారనే అసహ’నా’న్-సెక్యులర్ అశ్రువులు మరి కొందరివి.

ఈ ఎమోజీలన్నీ కురిపించిన అశ్రుధారలతో గ్రూపంతా మొన్న వర్షాలకి మునిగినంత పంజేసిన హైదరాబాద్‌లా తయారైంది. ఇంతకీ మెసేజ్ ఏంటంటే –

శ్రీకృష్ణుడు ద్వారకని ఏలింది నిజమే, క్రీ.పూ. 3012లో మరణం – NASA నిర్ధారణ అనే హెడింగ్‌తో వున్న పేపర్ కటింగ్. దాని సారాశం  –

ద్వారకలోని సముద్రగర్భంలోంచి బయటపడుతున్న అవశేషాలు కృష్ణుడి అస్తిత్వాన్ని నిరూపిస్తున్నాయి (ట). (సముద్రగర్భంలో ద్వారక ఉందా? ద్వారకలో సముద్రగర్భం ఉందా అనే డౌటు తెలుగు సరిగ్గా వస్తే తప్ప రాదు కనక వదిలేద్దాం) ద్వాపరయుగంలో ఆయన ఈ భూమి మీద పరిపాలన సాగించాడన్నది వాస్తవమని NASA ప్రకటించేసింది(ట). (తెల్లారి లేస్తే అప్రాచ్యులు అంటూ మనం తిట్టుకునే అమెరికా వాడు మన కృష్ణుడి అస్తిత్వాన్ని ప్రకటించడం ఏంటో? వాడు చెప్తే తప్ప మనకి నమ్మకం కుదరకపోవడం ఏంటో?నీట మునిగిన కోటలు, శిధిలాలు చూసి మన ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళే ఒకప్పటి నాగరికతకి ఆధారాలు అన్నారు కానీ కృష్ణుడు ఇక్కడే ఉండేవాడని తీర్మానించలేదు. ఈ నాసా వాళ్ళెలా చెప్పారో?) క్రీ.పూ. 3012 ఫిబ్రవరి 17న ఆయన తనువు చాలించాడని లెక్కకట్టిందిట. ఆధునిక పరిజ్ఞానంతో ఖగోళశాస్త్రం ఆధారంగా ఈ లెక్కలు వేసినట్టు నాసా వెల్లడించేసింది(ట కూడా). ఆయన అదృశ్యమైన రోజున నవగ్రహాలు, మేషరాశి ఒకే రేఖపై నిలిచాయని కూడా పేర్కొంది (ట) (క్రీ.పూ. 3102, ఫిబ్రవరి 18 అని మనవాళ్ళే వేసిన లెక్కని, ఆస్ట్రనామికల్ ఆస్ట్రాలజీ అనే మన సొంత ‘టెక్నాలజీ’ని నాసా వాళ్ళు కొట్టేసారన్నమాట.ఇది మాత్రం మనం గర్వించాల్సిన విషయమే)

మెసేజి, ఐ మీన్ పేపర్ కటింగ్, అంతా చదివాక మైండ్‌ ఆనందభాష్పాల ఎమోజీలతో కిక్కిరిసిపోయింది. నీళ్ళతో నిండిన కళ్ళలో ఒక అద్భుతదృశ్యం, విజన్ – నాసా ప్రెసిడెంట్ రెండు చేతుల్లో రెండు స్పేస్ షటిల్ మోడల్స్ పట్టుకుని ద్వారక వైపు పరుగులు పెడుతున్నట్టు😉. చుట్టూ వెతుకుతున్నాయి కళ్ళు. నాసా ప్రెసిడెంటు కోసం అభయహస్తంతో మాయాబజార్లో ఎన్టీయార్లా తల పంకిస్తూ ఎదురుచూస్తున్న శ్రీకృష్ణుడికోసం. నాసావారి పుణ్యమా అని నాక్కూడా శ్రీకృష్ణదర్శనం ఐపో……

ఐతే – ఎంత వెతికినా చుట్టూపక్కలెక్కడా ద్వారకాధీశుడు కనబళ్ళేదు. నిరాశతో కళ్ళు తుడుచుకుంటూ ట్రాన్స్‌లోంచి బయటికొచ్చి చూస్తే ఎదురుగా కిరీటం, నెమలిపింఛం పెట్టుకున్న thinking face 🤔 ఎమోజిలాంటి ముఖంతో ఆ పేపర్ కటింగ్ చదువుకుంటూ కనిపించాడు.

WhatsApp Image 2017-10-06 at 13.24.49

ఆ ఎమోజిలో కనీసం నాలుగు ప్రశ్నలు కదలాడుతున్నాయ్, అవి –

ఒకటి – నేను ఉన్నాను అని ఏ.ఎస్.ఐయ్యో, ఇస్రోనో చెప్పొచ్చుగా? NASA శంఖంలో పోస్తేగానీ తీర్థం అవ్వదా?🤔

రెండు – నా ఉనికిని ఋజువు చెయ్యడానికి, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటే అదో అందం, ఈ తప్పులతడక “సైంటిఫిక్” ప్రచారం కంటే మార్గం లేదని నమ్మే శాల్తీలున్నాయా🤔?

మూడు – కురుక్షేత్ర యుధ్ధానికి బ్రేక్ ఇచ్చి మరీ లైఫ్-ఫిలాసఫీ బోధిస్తే అందులో ‘పుట్టినవానికి మరణము, పోయినవానికి జననము..’ టాపిక్ తప్ప ఇంకేం లేనట్టు ఎవరైనా పోయినప్పుడు తప్ప జనానికి గుర్తు రాదు. అలా అని ఎవరైనా పుట్టినప్పుడు కూడా  గుర్తు చేసుకోవాలిగా ఈ సంగతి? అబ్బే, అప్పుడు గుర్తు రాదు. ఈ జనానికి ఇంతకంటే మంచి ఐడియాలు ఎలా వస్తాయ్🤔 ప్చ్?

నాలుగు – ఖగోళ జ్యోతిష శాస్త్రం వీళ్ళకి చేతకానట్టు నాసా స్టాంప్ వెయ్యడం ఎందుకో? ఎవర్ని నమ్మించాలని? ఐనా, నా ఉనికిని సైంటిఫిగ్గా నిరూపించాలంటే జ్యోతిషం ప్రకారం వీళ్ళు చెప్పే డేట్స్‌తో పాటు సముద్రం అడుగున నా అష్టభార్యల పాలెస్‌లు ఎనిమిదీ వున్నాయి, అవి వెలికి తియ్యచ్చుగా? 🤔

ఇలా అనుకుంటూ స్వామివారు నా వైపు చూసినట్టనిపించింది. ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే తన ప్రశ్నలన్నీ వాట్సాప్‌లో పెట్టి జవాబులు రాబట్టమంటాడేమోననిపించింది. అనిపించి మనసంతా ఆనందభాష్పాల – కాదు కాదు ఏడవలేక నవ్వే 😂ఎమోజి అయిపోయింది. నన్నిన్వాల్వ్ చెయ్యకు స్వామీ అని మనసులోనే లెంపలు వేసుకున్నా. స్వామివారికి పరిస్థితి అర్ధమై తనూ అంతర్ధానమయ్యాడు. 

ఇంతేసంగతులు. బై4నౌ 😂 

***

 

9 responses to “వాట్సాప్ప్ ముచ్చట్లు (2) – N.A.S.A🚀 కృష్ణ🙏 N.A.S.A 🚀కృష్ణ🙏||కృష్ణ🙏 కృష్ణ🙏 N.A.S.A 🚀N.A.S.A🚀”

  1. Zilebi Avatar
    Zilebi


    USA అంటే మా ముంబై కర్లకు ఉల్లాస్ నగర్ సింధి అస్సోసియేషన్ అండి
    ఆలాగే NASA కు కూడా ఏదన్నా ఉంటుందంటారా ? 🙂
    శ్రీకృష్ణుడు బుద్ధుని తరువాతి కాలం వాడండి. మహా విష్ణువే బుద్ధుని తరువాతి కాలం వాడు. అట్లాం టప్పుడు శ్రీ కృష్ణుడు ఎప్పటి వారో చూడండి లేక్ఖలు వేసి.
    జిలేబి


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      జిలేబిగారు,ఆ మధ్య యూ ట్యూబ్ లో ఒకాయన బెర్ముడా ట్రయాంగిల్లో విమానాల్ని షిప్పుల్ని మాయం చేస్తున్నది సింహిక కూతురని, హనుమంతుడు దాన్ని
      అక్కడ పాతేసాడని వాకృచ్చారండి. ఆయన్ని అడగాలి NASA కాని NASA ఇంకేదైనా ఉందేమో. శ్రీకృష్ణుల వారి కాలం లెక్కలు కూడా ఆయన తేల్చెయ్యగలరు .😃

      Like

  2. వెంకట రాజారావు . లక్కాకుల Avatar
    వెంకట రాజారావు . లక్కాకుల

    శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
    చెవుల కుండల దీప్తి చెలువు వాడు
    నుదుటిపై కస్తూరి మృదు తిలకముల వాడు
    ఉరమున కౌస్తుభం బొలయు వాడు
    నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
    కరమున వేణువు మెరయు వాడు
    చర్చిత మైపూత హరి చందనము వాడు
    గళమున ముత్యాల కాంతి వాడు
    తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
    నంద గోపాల బాలు డానంద హేల
    లీల బృందావనము రాస కేళి దేల
    వచ్చు చున్నాడు కన్నుల భాగ్య మనగ .


    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      మాస్టారు, మీ కృష్ణ స్తుతి చాలా అందంగా వుంది 🙏.

      Like

  3. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    బెర్ముడా ట్రయాంగిలూ, సింహికపుత్రీ 🙂. యూట్యూబ్ విడియోల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఇలా జ్ఞానం వెదజల్లేవారు ఎక్కువైపోయారు. మనకి బుర్రంతా గందరగోళంగా తయారవుతోంది.
    “ద్వారకలోని సముద్రగర్భం …. ” 😀😀. కానీ పాపం అపార్థం చేసుకోకండి. ద్వారక పట్టణం దగ్గరున్నటువంటి ఆ యొక్క సముద్రం యొక్క గర్భం అని భావమేమో పాపం !? 😀😀
    బాపు గారి “రాధాగోపాళం” మూవీలో గోపాలం-శ్రీకృష్ణ సంవాదంలా ఉంది మీరూ కృష్ణుడూనూ 🙂.
    అవునూ, జిలేబి గారి వ్యాఖ్యలో మీకొక క్లూ దొరకలేదూ? అదే “మా ముంబై కర్లకు” అనడంలో తన ఊరు ముంబాయి అని చెప్పకనే చెప్తున్నట్లు లేదూ? Ha ha 🙂.

    https://polldaddy.com/js/rating/rating.js

    Like

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      వీఎన్నార్ సర్, థాంక్సండి. 1) ఆ యూట్యూబ్ వీడియోల్ని చూసి ఆనందభాస్పాలు విడిచే వాళ్ళని చూస్తే మరీ గందరగోళం అవుతోంది. 2) రాధగోపాళం చూడలేదు. మీరు చెప్పిన తరువాత చూడాల నిపిస్తోంది. 3) జిలేబిగారు ఎందెందు వెతికిన అందందే కలరు.

      Like

  4. Lalitha TS Avatar
    Lalitha TS

    NASAగ్రే నవ ఉక్తి.com 😀

    https://polldaddy.com/js/rating/rating.js

    Liked by 1 person

    1. YVR's అం'తరంగం' Avatar
      YVR’s అం’తరంగం’

      సూపర్ పన్ 👌👌👌, మీ మాటల్లోనే చెప్పాలంటే – “పన్నాద్భుతః” 😊😊

      Like

  5. Zilebi Avatar
    Zilebi

    NASA గ్రే నవ ఉక్తియ !
    భేషౌ ! లలితా జిలేబి పెంపెక్కెన్బో 🙂
    భాషా యోషకు మరియొక
    పేషానీయయ్యిరి మజ బేమిస్‌ల్ యనగన్ !

    చీర్స్
    జిలేబి

    https://polldaddy.com/js/rating/rating.js

    Liked by 1 person

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)